వైస్సార్ వ్యక్తి పేరా? పార్టీ పేరా?

 వైస్సార్ వ్యక్తి పేరా? పార్టీ పేరా?


 ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్ టీ ఆర్ పేరు కొనసాగించాలి

ప్రభుత్వ పథకాలకు ఎదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి అనే పూర్తి పేరు పెట్టాలి

 ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు  పెట్టడం వైస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేస్తుంది

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, పథకాలకు వైస్సార్ పేరు వైస్సార్ కాంగ్రెస్ పార్టీనే గుర్తు చేస్తోంది

వైస్సార్ పేరుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన కార్పొరేటర్ ఫిర్యాదు

విశాఖపట్నం, సెప్టెంబర్24: ప్రభుత్వ పథకాలకు, పటిష్ట సంస్థలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం ఆయనకు ఇచ్చే గౌరవం.  వైస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం 55 పథకాలకు వైస్సార్ అని పేరు పెట్టడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడం పార్టీ పేరును సూచిస్తోందే తప్ప వైఎస్ రాజశేఖరరెడ్డిని  కాదని జనసేన కార్పొరేటర్ పీతల ముర్తి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికారంలో ఉన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  తమ పార్టీ పేరు సూచించే విధంగా 55 ప్రభుత్వ పథకాలకు పేరు పెట్టింది. అంతటితో ఆగక  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా తమ పార్టీ పేరు సూచించేవిధంగా  మార్చి ప్రజలను ప్రభావితం చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ  శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి   ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి పెట్టిన వైస్సార్ పేరు పార్టీదా, వ్యక్తిదా అనే సందేహాని వ్యక్తం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేయకుండా  ప్రభుత్వ పథకాలకు  రాజశేఖర రెడ్డి పూర్తి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వైస్సార్ అని షార్ట్ కట్ లో పెట్టడం పార్టీని గుర్తు చేస్తుందే తప్ప రాజశేఖర రెడ్డిని కాదన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 55 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉన్న ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల నామకరణానికి తమ సొంత రాజకీయ పార్టీ పేరును ఉపయోగించలేదని చెప్పారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి తన తండ్రి యెదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి కృషికి కృతజ్ఞతలు చెప్పాలను కొంటే గత ముఖ్యమంత్రి ఎన్ టీ ఆర్ పేరు మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.కొన్ని ప్రభుత్వ పథకాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంలో అభ్యంతరం లేనప్పటికీ   ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పార్టీ పేరును వైఎస్ఆర్ అనే సంక్షిప్త రూపంగా ఉపయోగించడం ఎన్నికల సంఘం పరిశీలించాల్సిన అంశమన్నారు. ఉద్యోగి యొక్క ఐడి కార్డ్ నుండి ప్రారంభించి, యుటిలిటీ ఛార్జీల చెల్లింపులో ఏదైనా చివరి రసీదు వరకు పార్టీ యొక్క ఈ పేరు వైస్సార్,  ఆ పార్టీ జెండాల రంగుగా ఉంటుందని విమర్శించారు.గత మూడేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పథకాలు ఎలా ఉపయోగించబడ్డాయో, ఎన్నికల ప్రచారానికి దాని వినియోగాన్ని గమనించాలని ఎన్నికల సంఘానికి కోరారు. ఈ పార్టీ తన పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ తాజా ప్లీనరీలో ఆమోదించిన సవరణ ద్వారా వైఎస్ఆర్ పార్టీ పేరును ప్రజాదరణ పొందిందనే విషయం లేఖలో ఎన్నికల సంఘానికి తెలిపమన్నారు. అయితే వారు ఇప్పటి వరకు తమ సమావేశ మినిట్స్‌ను సమర్పించలేదు కానీ వేరే పార్టీకి కేటాయించిన వైఎస్ఆర్ పేరును క్లెయిమ్ చేశారని విషయాన్ని గుర్తుచేశారు. ప్లీనరీ వేదికపై వారి పార్టీ ప్రధాన కార్యదర్శి అప్రజాస్వామికంగా జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించుకోవడం అలాగే పార్టీ గుర్తు కేటాయింపుపై ఆర్డినెన్స్‌లు  ఉల్లంఘించబడ్డాయని లేఖ లో తెలిపారు.