కాపు సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం.

కాపు సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం.

ఎండాడ:విశాఖ లోకల్ న్యూస్ :సెప్టెంబర్ 25


గత కాలం క్రిందట విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఎండాడ లో కాపు సామాజిక భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరడంతో ఆదివారం నాడు నిర్మాణం సంభందించిన జీవో విడుదల చేయడం తో స్థలాన్ని పరిశీలించారు 

ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్థలాన్ని కెటాయించి అధికారిక జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి కి కాపు కమ్యూనిటీ తరుపున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే భవనం నిర్మాణం కి 7 కోట్లు రూ అవుతందని చెప్పగానే ఆయన మొదటి ఫేజ్ క్రింద 2 కోట్లు రూ విడుదల చేసారు. గత ప్రభుత్వాలు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు జగన్ మోహన్ రెడ్డి కైతే అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధే ముఖ్యం కాపు సామాజిక వర్గాని కి పలు పథకాలు అందివ్వడమే కాక పదవుల్లో కూడా పెద్దపీట వేశారు. మేమంతా ఆయనతో ఉంటాం కాపు సామాజిక భవనం నిర్మాణం కోసం నాతో పాటు పాటుపడిన ప్రతీ సోదరుడు కి నా దన్యవాదాలు త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

కాపు కార్పోరేషన్ చైర్మన్ మాట్లాడుతూ అవంతి శ్రీనివాసరావు మాజీ ఇంఛార్జ్ మంత్రి కన్నబాబు కృషి వలనే రాష్ట్ర కాపు కార్పోరేషన్ ద్వారా ఎండాడ లో కాపునాడు భవనం రావడానికి మార్గం సుగమనం అయిందని తెలిపారు.విశాఖ జిల్లా కాపునాడు నాయకులు అందరూ సియంకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు,భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , భీమిలి ఇంచార్జ్ మహేష్ ,విశాఖ జిల్లా కాపునాడు అద్యుక్షులు తోట రాజీవ్, బి సి కార్పొరేషన్ ఏడి ప్రసాద్ రావు, యంఆర్వో పాల్ ,కార్పోరేటర్ లొడగల అప్పారావు ,వైసిపి నాయకులు చందర్రావు , శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు,లింగేశ్వర రావు,బుజ్జీ, పాల్గొన్నారు.