సీనియర్ జర్నలిస్ట్ బొల్లు కృష్ణారావు 78వ జన్మదిన వేడుకలు

 సీనియర్ జర్నలిస్ట్ బొల్లు కృష్ణారావు 78వ జన్మదిన వేడుకలు..


మధురవాడ, విశాఖ లోకల్ న్యూస్ సెప్టెంబరు 22 ....

సీనియర్ జర్నలిస్ట్ బొల్లు కృష్ణారావు 78 వ జన్మదిన వేడుకలు చంద్రంపాలెం దుర్గాలమ్మ టెంపుల్ వద్ద ఘనంగా మధురవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరూ కలిసి ఘనంగా జరిపారు.

 కృష్ణా రావు తో ముందుగా కేక్ కట్ చేయించి అనంతరం దుశ్శాలువ లు, పూలదండలతో సతీ సమేతంగా ఘనంగా సత్కరించి , వస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో అక్షర భాను పత్రిక చైర్మన్ గురు అహ్మద్, పౌర సంక్షేమ సంఘం సభ్యులు, శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు పిల్ల సూరిబాబు, తాతారావు కూడా తమదైన శైలిలో మర్యాదపూర్వకంగా కృష్ణారావు ను సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఏ. సాంబశివరావు, బి ఆనందరావు, ప్రజా ప్రతిభ సురేష్, విజయ్ కుమార్, అభిరామ్, బాలుపాత్రో తదితరులు మాట్లాడుతూ సుమారు నాలుగు దషాబ్దాలకు పైగా పాటు పత్రికా రంగానికి స్థానిక జర్నలిస్టుగా సేవలు అందించిన ఘనత కృష్ణారావుదని కొనియాదారు. విశాలాంధ్ర ఆంధ్రజ్యోతి, నేటి వార్త,

గ్రేటర్ న్యూస్ పత్రికలలో పనిచేసినప్పటికీ సుదీర్ఘకాలంపాటు, ప్రస్తుతం విశాలాంధ్రలో కొనసాగడం వల్ల విశాలాంధ్ర కృష్ణారావు గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.. ముక్కుసూటిగా మాట్లాడటం, పలు సమస్యల పరిష్కారానికి నాయకులను అధికారులను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ వాటి పరిష్కార మార్గానికి కృషి చేసిన ఘనత ఆయనది అని అన్నారు. జర్నలిస్ట్ సంఘం నాయకుడు బంగారు అశోక్ ,ఈనాడు రిపోర్టర్ శ్రీను, ప్రజాశక్తి శ్రీను ఎన్ ఎన్ నాయుడు, సాక్షి రామనాయుడు తదితరులు సన్మాన గ్రహీత కృష్ణారావు తమకు గురు సమానులని తమకున్న అనుబంధాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో అక్షర కిరణం రవి పూజారి, ప్రైమ్ 9 హేమంత్ తదితరులు పలు గీతాలు ఆలపించి అందరినీ అలరించారు.ఈసందర్భంగా సన్మాన గ్రహీత కృష్ణారావు మాట్లాడుతూ వర్తమాన జర్నలిస్టులు తగు జాగృతి తో మెలగాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. గతంలో జర్నలిజంలో నైతిక విలువల ప్రధానంగా తదితరులు అని ఉండేవని, ప్రస్తుతం పత్రికా యాజమా న్యాలు వ్యాపార ధోరణి అవలంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టు పని ఒత్తిడి తగ్గించుకొని, రుజుమార్గం లో పయనించాలని ఆయన సూచించారు.. తనకు సన్మానం చేయడం పట్ల అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గణేష్, శ్రీహరి, హరికృష్ణ , విపత్తి శ్రీను,సాయి  గుణ వర్ధన్, జానకి రామ్, సత్యం ,రాజారావు సత్యనారాయణ ,సుదర్శన్, నాగేశ్వరరావు తదితర జర్నలిస్టుల తో పాటుస్థానిక వైకాపా నాయకులు బంగారు ప్రకాష్, రజిని టిడిపి నాయకులు దాసరి శ్రీనివాస్, నమ్మి రమణ, కె వి ఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథం తదితరులు పాల్గొన్నారు