సిటీ బస్సును ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు

 సిటీ బస్సును ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు...

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

ఆనందపురం మండలం దబ్బంది కి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక స్థానికులు చాలా ఇబ్బందులు పడటం భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాసరావు  దృష్టికి స్థానికులు తీసుకురాగా వెంటనే స్పందించిన శాసనసభ్యుడు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి దబ్బంఛి  నుంచి వయా పాత పోస్టాఫీసు కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా వెంటనే స్పందించిన అధికారులు గురువారం ముతంశెట్టి. శ్రీనివాసరావు  చేతులు మీదుగా 60D బస్సు ను ప్రారంభించడం జరిగింది.

కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దబ్బంది మామిడి లోవ ఇలా చుట్టు పక్కల గ్రామాల నుంచి గోపాలపట్నం ఆటోలలో వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేదని, ఉద్యోగస్థులు కు కూడా పలు ఇబ్బందులకు గురి అవుతండటం నా దృష్టికి రాగా  వీరి సమస్య తీరడంతో స్థానికులు పొందే ఆనందం ఎనలేనిదని అలాగే సెల్ టవర్ , మధురవాడ కి దబ్బంది కి రోడ్డు మార్గం త్వరలో నిర్మించడం జరుగుతుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల యంపిపి జెడ్పిటిసి  వైస్ యంపిపి పార్టీ ప్రెసిడెంట్ సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు