ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.

 ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.

విశాఖపట్నం:ఆనందపురం.


 మండలంలోని రామవరం, శొంట్యం, నీళ్ళకుండీలు వంటి పలు ప్రదేశాలలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామవరం లో దాదాపు పది నిరుపేద  కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు, శొంట్యం లో చెరువు పని వారికి, నీలకుండీలు జంక్షన్ లో వాహన దారులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ  ఆయన మరెన్నో మంచి సినిమాల్లో నటించి, అభిమానులను అలరించాలని అన్నారు. ఆయన పిలుపు మేరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేసి ప్రయాణికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పృథ్విరాజ్, గౌరినాయుడు, అప్పలరాజు, రాంబాబు, పక్కుర్తి సాయి, కోరుకుండ రమేష్, బూర్లు శ్రీను, నాగిశెట్టి సురేంద్ర, లడ్డు తదితరులు పాల్గొన్నారు.