జీవీఎంసీ 28వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలుకు శంకుస్థాపన.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
జీవీఎంసీ 28వ వార్డ్ పరిధిలోని ఉన్న జై సంతోషిమాత కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి సిసి రోడ్లు డ్రైన్లు 34 లక్షల 80 వేల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లు రైలు స్పీడ్ బ్రేకర్లు కార్యక్రమం చేయబడింది ఈ యొక్క కార్యక్రమంలో మేయర్ గోలగాని హరి వెంకట కుమార్, వి ఎమ్ ఆర్ డి ఏ చైర్ పర్సన్ అక్కరమని విజయనిర్మల 28వ వార్డ్ కార్పొరేటర్* పల్లా అప్పలకొండ 28వ వార్డ్ ఇంచార్జ్ పల్లా దుర్గారావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు నాయకులు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అదే విధంగా అక్కడ ప్రజలందరూకి కూడా మీటింగ్ పెట్టి వారికి అభివృద్ధి కార్యక్రమాల వివరాలు వివరించి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మన వార్డులో నిర్వహిస్తాము అని పల్లా దుర్గారావు చెప్పారు. మీకు ఇంకా రానున్న రోజులులో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాము అని హామీ ఇచ్చారు. మరింతగా మన వార్డ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి జరిగే విధంగా పాటుపడతానని ఈ సందర్భంగా వారికి వార్డ్ ఇంచార్జ్ పల్లా దుర్గారావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

