వృక్ష ఫౌండేషన్ కు ప్రశంసా పత్రం.

 వృక్ష ఫౌండేషన్ కు ప్రశంసా పత్రం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి.

ఇండియన్ నేవీ 3 ఏ నావెల్ ఆంధ్ర ఎన్ సి సి తరుపున కే స్ బాలాజీ- కమాండర్, ఏటీసీ -2  వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్ కుమార్ కు ప్రశంసా పత్రం అందజేశారు .

జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులలో నైపుణ్యతను, కెరియర్ పై అవగాహన ,ఇండియన్ నేవీ NCC చేపట్టిన ఓషన్ క్లీన్ లో పాల్గొని   సహాయ సహకారాలు అందించిన వృక్ష ఫౌండేషన్కు ప్రశంసాపత్రం లభించింది.

మే 31న నుండి ఏ అమ్ జి సెదర్ స్కూల్ లో నిర్వహించినటువంటి ఇండియన్ నేవీ ఎన్ఎస్ఎస్ క్యాంపు ఎనిమిది వందల మంది విద్యార్థులతో హాజరవడం జరిగింది.

విద్యార్థులతో మాట్లాడుతూ కెరియర్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఉత్తమ కేడెట్ లు బహుమతులు అందజేశారు .

ఈ కార్యక్రమంలో వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్ కుమార్  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థులకు NCC పాత్ర సమాజానికి చాలా అవసరం అని ప్రతి విద్యార్థులు NCC గా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రమశిక్షణ, విలవులు మరియు ఉద్యోగ అవకాశాలు వారికి కూడా చాలా ఉపయోగపడుతుందని.

పాఠశాలలో మొదలుకుని కాలేజీలో వరకూ ఎన్ స్ స్ లో గాని ఉన్నట్లయితే సమాజంలో మంచి పాత్రను పోషిస్తారని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాయి రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.