బ్రాండెక్స్ కంపెనీ లో అమ్మోనియా లీక్ అయ్యి అశ్వస్థతకు గురయ్యి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బి జె పి ఎమ్ ఎల్ సి మాధవ్.

 బ్రాండెక్స్ కంపెనీ లో అమ్మోనియా లీక్ అయ్యి అశ్వస్థతకు గురయ్యి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బి జె పి ఎమ్ ఎల్ సి మాధవ్.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి.

శుక్రవారం బ్రాండెక్స్ కంపెనీ లో అమ్మోనియా లీక్ అయ్యి సుమారు 200లకు పైగా మహిళా కార్మికులు అశ్వస్థతకు గురయ్యి ఎన్ టి ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బి జె పి ఎమ్ ఎల్ సి మాధవ్ ఆసుపత్రిలో పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకుని అనంతరం మీడియా తో మాట్లాడారు. ప్రధమచికిత్స లేకపోవటం వల్ల ప్రమాదం తీవ్రమైయిందని ప్రమాదం జరిగి నాలుగు ఆసుపత్రులలో బాధితులను ఒక్కో బెడ్ పై నలుగురు, ఐదుగురుకు చికిత్స అందిస్తుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రమంతా కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులుకు గురువుతున్నారని ఆసుపత్రిలలో కూడా కరెంటు కోతలు విధించి కనీసం జనరేటర్లకు డీజిల్ కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇప్పటికైనా ఆసుపత్రిల్లో కరెంట్ కోతలు లేకుండా చూడాలని ఆసుపత్రిలో బెడ్లు సమకూర్చి మెరుగైన చికిత్స అందించాలని, అసలు ఘటన కు గల కారణం పై విచారణ చేపట్టి మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని కోరారు.