మధురవాడలో యోగాంధ్ర విజయవంతమా లేకా విఫలమా?

మధురవాడలో యోగాంధ్ర విజయవంతమా లేకా విఫలమా?                                    

అదికారులు నాయకులు అంచనాకి మించి ప్రజలు రావటంతో చేతులెత్తేసిన అధికారులు.      

మధురవాడ : న్యూస్ విజన్ : జూన్ 21:   


        మధురవాడ పరిసర ప్రాంతాలలో స్టేడియం, స్టేడియం బి గ్రౌండ్, సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల, పనోరమ హిల్స్ రహదారిలో పలు చోట్ల యోగాంధ్ర శిబిరాలు ఏర్పాటు చేసారు.  ఈ శిబిరాలు ముందస్తు ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయటంతో శిబిరాల వద్ద ప్రజలను నియంత్రించ లేకపోయారు. అధికారులు నాయకులు యోగాంధ్రకు వచ్చే ప్రజల అంచనా వేయటంలో విఫలమయ్యారు అనటంలో సందేహం లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురికి ఒక మంచినీటి బాటిల్ ఇచ్చారని బస్సు ఇంచార్జ్ లు వాపోయారు. రిజిస్ట్రేషన్ లు చేయాలని ఒక వైపు సచివాలయం సిబ్బంది, ఒక వైపు నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు తెలిపారని అన్నారు.

రిజిస్ట్రేషన్ చేసి ప్రజలలో ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి ఎంతో శ్రమించి జనాలను సమీకరించామని తెలిపారు. తీరా బస్సు బయలు దేరే సమయానికి ఒక సచివాలయం అధికారి కానీ, ఒక నాయకుడు కానీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. నాయకులు సమావేశాలలో  ఆలా చెయ్యాలి ఇలా చెయ్యాలని పిలుపు నిచ్చి జన సమీకరణం అష్టకష్టాలు పడి చేసి శిబిరాలు వద్దకు తరలిస్తే కనీసం కార్యకర్తలను కాతరు చెయ్యలేదని కూటమి కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవారు జామున రెండు గంటలకు జనాలను సిద్ధం చేసి ఏడు అయ్యిన బస్సు రాలేదని మమ్మల్ని రోడ్లపై ఉంచిన అధికారులపై చర్యలు తీయనుకోవాలని కోరారు