రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల విశాఖ నుంచి తరలి పోతన్న మరో కేంద్ర సంస్థ.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం మరో కేంద్ర సంస్థ విశాఖ నుంచి తరలి పోతుంది. విశాఖ వుడా కార్యాలయ సముదాయం ఉద్యోగ భవన్ లో దశాబ్దాలుగా నడుస్తున్న భారత ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( బీ ఎస ఐ) విశాఖ నుంచి తరలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ఉద్యోగ భవన్ నుంచి ఖాళీ చేయాల్సిందిగా వుడా అధికారులు తాఖీదు ఇవ్వటంతో మరోమార్గం లేక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కార్యాలయం జూన్ 10న ఇక్కడి నుంచి వెళ్లి పోతుంది. విశాఖ పరిశ్రమలకు కేంద్రం కావడంతో దశాబ్దాల క్రితమే ఈ సంస్థ కార్యాలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం లో ఏర్పాటు చేశారు. స్టీల్, జ్యూట్ , గోల్డ్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ,ఎల్పిజి సిలిండర్లు ఆహార పరిశ్రమలు వంటి వాటెన్నింటికో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రామాణిక సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ విశాఖ నుంచి వెళ్ళటంతో ఈ పరిశ్రమల నిర్వాహకులు అంతా సర్టిఫికెట్ల కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా స్వీకరించిన తరువాత పరిశ్రమల ప్రామాణిక సంస్థ విశాఖ ను వీడుతుండడం నిజంగా బాధాకరం .దురదృష్టకరం. ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరిన్ని తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నవాటిని ఇక్కడినుంచి పంపించివేయటం అనుమానాలను రేకెత్తిస్తోంది. విశాఖ పరిపాలన రాజధాని చేస్తామని అసెంబ్లీలో చట్టం చేసి పదే పదే ప్రకటన జారీ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఉన్న సంస్థలను పోగొట్టడం నిజంగా బాధాకరం. ఈ సంస్థ సర్టిఫికెట్ అవసరమైన పరిశ్రమలు రాష్ట్రంలో 800 ఉండగా విశాఖ కి చుట్టూ ఉన్న ఐదు జిల్లాల్లోని 600 ఉన్నాయి. ఈ పరిశ్రమల యజమానులు అంతా ప్రతియేటా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాడానికి తమ శాంపిల్స్ను ను ఈ సంస్థకు పంపించాలి. ఇప్పుడు విశాఖ నుంచి సంస్థ తరలిపోతేవీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విశాఖ వుడా కు చెందిన ఎన్నో వాణిజ్య భవన సముదాయాలు ఖాళీగా ఉండగా వాటిని వినియోగించకుండా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలను ఖాళీ చేయించడం రాష్ట్రానికి ద్రోహం చేయడమే అవుతుంది. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి గా చెప్పుకునే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మరో ముగ్గురు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎం పీ లు విశాఖ లోనే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తో లాబీ చేసి మరిన్ని సంస్ధలను విశాఖకు తీసుకురావాల్సిన మీరు ఉన్న సంస్థ తరలిపోతుంటే నిర్లక్ష్యం గా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎం పీ లు స్పందించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విశాఖనుంచి తరలిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖను పారిశ్రామిక హబ్ గా చేస్తామని పేర్కొంటూ పదేపదే ప్రకటన జారీ చేసే పెద్దలు పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు తీసుకోవటం బాధాకరం.ఈ కార్యక్రమంలో కళ యడ్లపల్లి, భోగిల శ్రీనివాస పట్నాయక్ పాల్గొన్నారు.

