విశాఖపార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి కామెంట్స్.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం టిడిపి విశాఖపార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి మాట్లాడుతూ తల్లుల పెంపకం సరిగ్గాలేకే అఘాయిత్యాలు జరుగుతున్నాయని హోమ్ మంత్రి ఎలా అంటారు. మహిళలకు భద్రత కల్పించడం చేతకాక ఇలా మాట్లాడు తున్నారు. విజయమ్మ పెంపకం లోపం వల్లే జగన్ 16 నెలల జైలుశిక్ష అనుభవించాడనుకోవాల? తల్లుల పెంపకాన్నే తప్పుపట్టిన హోమ్ మినిస్టర్ తానేటి వనిత ని సూటిగా అడిగారు.మినిస్టర్ వనిత మరి దిశా పోలీస్టేషన్లు ఎందుకు పెట్టారు 800 పైగా అత్యాచారాలు జరిగిన తర్వాత ఆఖరికి తల్లుల పెంపకాన్ని తప్పు పడతారా అని ప్రశ్నించారు.ఈ సమావేశంలో సరస్వతి అనంతలక్ష్మి, గణగళ్ళ సత్య, పళ్ళ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

