మధురవాడ సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మేడే

 మధురవాడ సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మేడే.

విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి

ఆదివారం మధురవాడ ఏరియాలో సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మేడే జరుపుకున్నారు సి పి ఐ పార్టీ ఆఫీసు వద్ద ఎస్ కే భేగమ్ శివా శక్తి నగర్ లో కేశవయ్య మల్లయ్య పాలెంలో కె మేఘ రావు నగరం పాలెంలో వాండ్రాసి అప్పలకోండ పాత మధురవాడ లో కె కుమార్ జెడ్ పి హెచ్ స్కూల్ వద్ద ముఠా కార్మికులు మేస్త్రీ బి బంగారయ్య జెండాలు ఎగరవేసారు మధురవాడ సి పి ఐ పార్టీ నాయకులు వాండ్రాసి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాళ రాస్తూన్నారన్ని నరేంద్రమోడీ విశాఖ ఉక్కు ను ప్రవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చూస్తున్నారు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులు ను అసలు పట్టించు కోవటం లేదు కరోనా నేపథ్యంలో ఉపాధి లేకుండా రోడ్డు న పడ్డ ఏ ఒక్కరినీ పట్టించు కోలేదు లేబర్ ఆఫీసు వద్ద లేబర్ కార్డులకు దరఖాస్తు లు చేసిన సంవత్సరములు గడచిన కార్డు లు రావడం లేదని కార్మికులు కు ఇబ్బంది కరంగా ఉంది వేంటనే కార్మికులు కు లేబర్ కార్డులు వచ్చేలా చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్ సన్నిపాత్రడు, త్రినాధ్, సతీష్, రామ్ మహేష్, ప్రసాద్, అప్పల రాజు ముఠా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.