శరవేగంగా టీడీపీ సభ్యత నమోదు చేయాలంటున్న గంటా తనయుడు రవితేజ

శరవేగంగా టీడీపీ సభ్యత నమోదు చేయాలంటున్న గంటా తనయుడు రవితేజ 

భీమిలి : వి న్యూస్ : నవంబర్ 09: 

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో గల క్లస్టర్ ఇంచార్జెస్, యూనిట్ ఇంచార్జెస్ మరియు మండల, వార్డ్ నాయకులుతో సభ్యత్య నమోదు కార్యక్రమంనకు సంభందించి భీమిలి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదుని త్వరగా పూర్తి చేయడానికి మరియు అనుకున్న లక్ష్యంని చేరడానికి అందరితో కో ఆర్డినేట్ చేసి మన రాష్ట్రంలోనే భీమిలి ఒక రోల్ మోడల్ గా నిలపడానికి అవలంభించ వలసిన కార్యాచరణ గురుంచి విశ్లేషణ చేసారు. ఈ సమావేశంలో అందరి సూచనలు మరియు సలహాలుతో సభ్యత్య నమోదును త్వరగా అనుకున్న సమయం కన్నా ముందుగా పూర్తి చేయాలనీ అందరకి సూచించారు.