ప్రజల పై భారాలు వేయడం ఆపండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుమార్ డిమాండ్.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 09:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ను అన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ కే ఎస్ వి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా,5 వ వార్డు పరదేశి పాలెం గ్రామం, కొత్త పరదేశి పాలెం లో పాద యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో కుమార్ మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్న ప్రభుత్వాలు, ప్రజల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టడం లేదని తెలియజేసారు.ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీలు పెంచుతుందని తెలియచేసారు.మరో వైపు కేంద్రం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు మద్దతుగా నిలుస్తూ, ప్రజల సంపదను దోపిడీ దారులకు దోచి పెడుతుందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మన అందరి భాద్యతగా పోరాటం సాగించాలని కోరారు.భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోరాడాలని పుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డీ అప్పలరాజు, డీ కొండమ్మ,బి భారతి, ఏ గురుమూర్తి రెడ్డి,కే సుజాత, లీల,డి అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

