ఐదవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో అభివృద్ధి పథంలో మధురవాడ అన్న భీమిలి ఎమ్మెల్యే గంటా
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 08:
5వవార్డు సమస్యలపై స్పందించి పరిష్కారం చూపుతున్న శాసనసభ్యులు గంటా కు 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత కృతజ్ఞతలు తెలిపారు.
జీవీఎంసీ (మధురవాడ) జోన్-2 పరిధి 5వ వార్డులో సాయిరాం కాలనీ, బొట్టవాణిపాలెం, మరియు నగరంపాలెంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 10కోట్ల20లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. త్వరలో శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని అన్నారు. భీమిలి శాసనసభ్యులు వార్డు సమస్యలపై స్పందించి పరిష్కారం చూపుతున్నారని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత శాసనసభ్యులు గంటా కు కృతజ్ఞతలు తెలిపారు.

