చంద్రంపాలెంలో అక్రమణకు గురయ్యిన ప్రభుత్వ భూమిని పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు.
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 08:
7వవార్డు చంద్రంపాలెంలో ప్రభుత్వ భూమి అక్రమణకు గురయ్యిందని సమాచారం తెలుసుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు సంబంధిత భూమిని శుక్రవారం పరిశీలించారు. స్థానిక నేతలు నుండి భూమిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డ్ అధ్యక్షులు పిళ్ళా నర్సింగరావు సీనియర్ నేత పిళ్ళా వెంకటరావు సర్వే నెంబర్ 175/3, 175/4 సుమారు ఎకరా పదనాలుగు సెంట్లు ప్రభుత్వ భూమి అక్రమణకు గురయ్యిందని ఎమ్మెల్యే గంటాకు తెలిపారు. వెంటనే ఆ భూమిని పరిశీలించి అక్రమణదారులనుండి స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

