గాజువాక బానోజి తోటలో కార్తీకంలో ఛట్ పూజ. భారీగా పాల్గొన్న భక్తులు.
గాజువాక : వి న్యూస్ : నవంబర్ 08:
గాజువాక బానోజి తోటలో కొంతమంది బిహారీ వాసులు గత 30ఏళ్లుగా ఈ చట్ పూజ ను వారు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ. ఛట్ పూజను సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్యుని ఆరాధించడంవల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమౌతాయని నమ్ముతారు. తాము, తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ చట్ పూజ చేసుకుంటారు.మనదేశంలో ఉత్తరాదిన ఈ ఛట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు.
ఛట్ పూజ కార్తీకమాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు. షష్టినాడు జరుపుకునే పండుగ, సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పాలు,పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు.ఛట్ పూజ చేసే మహిళలు ఉపవాసంతో ఉంటారు, ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనురాగ్, ముకేశ్, రాజన్,కాకి స్వరూప రాణి, గిరిజ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

