ఆరవ వార్డ్ సేవా నగర్ లో పలు సమస్యలపై వార్డ్ అధ్యక్షులు ఆధ్వర్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటాకు జోన్2 కమీషనర్ సింహాచలంకి వినతిపత్రం అందచేసిన ఎం1 కాలనీ ప్రజలు.
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 07:
సేవానగర్ ,M1- కాలనీ సమస్యలుపై జీవీఎంసీ స్కూలు ప్రాబ్లం (వర్షం వస్తే స్కూలు అంతా కారిపోతుంది), పైన ఉన్న పెంకులు, ఫ్లోరింగ్, వుడ్ వర్క్, గోడలు పెచ్చులు ఊడిపోవడం.. రెండు )బస్సు సమస్యల పై భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే (మాజీ మంత్రి), గంటా శ్రీనివాసరావు స్పందించి జోనల్ కమిషనర్ కి తెలిపారు. జోనల్ కమిషనర్ కి ఆరవ వార్డు సమస్యల్ని అధ్యక్షులు దాసరి శీను చేతుల మీదుగా వినతిపత్రం అందచేశారు. జోనల్ కమిషనర్ సింహాచలం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యల్ని తొందరగా పరిష్కరించమని సంబంధిత అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అప్పికొండ ఉమా మహేష్, కాలనీ జాయింట్ సెక్రెటరీ కింజరపు భరత్ కుమార్, మహిళా అధ్యక్షులు నడిపురి లూథియా, కమిటీ మెంబర్స్ సింగంపల్లి భవాని ఆకుల గౌరీ పాల్గొనడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి మరియు జోన్ 2 జోనల్ కమిషనర్ కి, వార్డ్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ కి మా యొక్క కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

