వైఎస్సార్సీపీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబుకి శుభాకాంక్షలు తెలిపిన దేవస్థానం బోర్డు మెంబెర్స్.
విశాఖ:
రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ గెలుపు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అక్కడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ఆ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాలను కూడా వెల్లడిస్తున్నారు. తాజాగా పార్టీలో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు. రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేశారు. కాసేపటికే పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేశారు. కొన్ని జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మరికొన్ని చోట్ల జిల్లా అధ్యక్షులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మార్చేశారు.
విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుని భాద్యతలను పంచకర్ల రమేష్ బాబు కి ఇవ్వడంతో కొందరు నాయకులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సింహాచల దేవస్థానం బోర్డు మెంబర్స్ సువ్వాడ శ్రీదేవి. పెనుమత్స శ్రీదేవి వర్మ, సంపంగి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపి మహిళా నాయకురాలు పద్మరాణి తదితరులు పంచకర్ల రమేష్ బాబును సీతమ్మధారలో గల ఆయన స్వగృహంలో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

