చింద్వారాకు వెళ్తున్న రైలులోని ఒక కోచ్‌లో మంటలు.

చింద్వారాకు వెళ్తున్న రైలులోని ఒక కోచ్‌లో మంటలు.

మధ్యప్రదేశ్‌:

మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ నుంచి చింద్వారాకు వెళ్తున్న రైలులోని ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఇండోర్ నుండి చింద్వారాకు ప్రయాణిస్తున్న 09589 బేతుల్-అమ్లా-చింద్వారా అనే ప్యాసింజర్ రైలు బోగీలో మంటలు చెలరేగిన వీడియో బయటపడింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, మొదట్లో ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి, అది తరువాత రైలులోని మిగిలిన రెండు కోచ్‌లకు విస్తరించింది.

మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. రైల్వే యార్డులో రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు.

మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధం కాగా, ఒకటి పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటన వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు.

రైలు సాయంత్రం 4 గంటలకు బేతుల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.