సేవా భావంతో నడుపుతున్న న్యూ లైఫ్ స్కూల్

సేవా భావంతో నడుపుతున్న న్యూ లైఫ్ స్కూల్

ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏయూ డాక్టర్ ఎస్ శ్యామ్ కుమార్ 

ఆనందపురం, మార్చి25, వి న్యూస్ ప్రతినిధి 

 లాభా పే క్షే ధ్యేయం కాకుండా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సేవలు ప్రశంసనీయమని ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎస్ శ్యాం కుమార్ అన్నారు. శనివారం మండలంలోని గొట్టిపల్లి న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 17వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడారు. మారుమూల గ్రామంలో ఒక కార్పొరేట్ విద్యా సంస్థ మాదిరిగా అన్ని వసతులు కల్పిస్తూ అతి తక్కువ ఫీజులతో ఆంగ్ల విద్యను అందించడమే కాకుండా తల్లిదండ్రులు లేని అనాధ బాలబాలికలను అక్కున చేర్చుకొని వారికి అన్ని వసతులు కల్పిస్తూ ఉచిత విద్యను అందిస్తున్న న్యూ లైఫ్ విజనరీ& డైరెక్టర్ డాక్టర్ కే శ్యామ్ మాథ్యూస్, ప్రిన్సిపాల్ కే జయశ్యామ్ కు ఆయన అభినందించారు.గ్రామీణ వైద్యుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోష్ మాట్లాడుతూ2005 సంవత్సరంలో మారుమూల గ్రామమైన గొట్టిపల్లి లో న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం స్థాపించి పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారనిఆయన అన్నారు.అంతేకాకుండా ఎంతోమంది అనాధ బాల బాలికలను అక్కున చేర్చుకొని వారికి అన్ని వసతులు కల్పించి ఉచితంగా విద్యను అందించారని ఆయన అన్నారు. సర్పంచ్ గంటా జగదీశ్వరరావు మాట్లాడుతూ గొట్టిపల్లి పంచాయితీలో ఇటువంటి మంచి పాఠశాల నెలకొల్పి మండలాలలోనే గొట్టిపల్లి కి ఒక గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కె శ్యామ్ మాథ్యూస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కె శ్యామ్ మాథ్యూస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో లాభ పేక్ష కాకుండా సేవాభావంతో 2005లో ఇక్కడ పాఠశాల నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో బాలికల కొరకు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ జయ శ్యామ్ వార్షిక నివేదికను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్య క్రీడా ఇతర రంగాలలో రాణించిన వారికి అతిధుల చేతుల మీదగా బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.