వాంబే కాలనీలో 45వ బ్లాక్ వద్ద సన్ సైడ్ విరిగి బాలికకు తలపై గాయాలు.

వాంబే కాలనీలో 45వ బ్లాక్ వద్ద సన్ సైడ్ విరిగి బాలికకు తలపై గాయాలు.

మధురవాడ: వాంబే కాలనీ:

మధురవాడ: జోన్ 2: 7వ వార్డు బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వాంబే కాలనీలో 45వ బ్లాక్ వద్ద సన్ సైడ్ విరిగి సి హెచ్ మనీషా  తలపై పడి గాయాలయ్యాయి.  క్షణంలో ప్రాణా పాయం తప్పింది అని అక్కడ ప్రజలు అన్నారు. విషయం తెలుకున్న భారతీయ జనతా పార్టీ సిటీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎండ అప్పారావు ఘటన స్థలం వద్దకు వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడి ఘటన వివారాలు అడిగి తెలుసు కున్నారని అన్నారు. కాలనీ వాసులు పెద్ద పెద్ద పెచ్చులు పడి ఆ బ్లాక్ లో ఉన్న వారంతా కూడా ఆందోళనతో బయటికి వచ్చారు అని ఈ పరిస్థితి చాలాచోట్ల వాంబే కాలనీలో జరిగాయి కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ వాంబే కాలనీకి అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి కూడా ఈ యొక్క నాయకులు కూడా పట్టించుకోవట్లేదు కేవలం వాంబే కాలనీలో రాజకీయ నాయకులు ఓటు అడుక్కోటానికి వస్తారు  ఓటు  ఉపయోగం అయ్యిన తరువాత వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అని సామాన్య ప్రజలపై ఎటువంటి దయ దక్షిణ్యం లేదు అని వాంబేకాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏమైనా నాయకులను అడిగితే ఓటుకి డబ్బులు తీసుకునే కదా వేశారు అన్నట్టు మాట్లాడుతున్నారని ఓటు కి డబ్బులు ఉచిత సంక్షేమ పథకాలతో అభివృద్ధిని మర్చిపోయారని అంటున్నారు.ఇదివరకే చాలా చోట్ల కూడా ఈ యొక్క పరిస్థితి ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు ముఖ్యంగా భీమిలి ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని ఈ యొక్క వాంబే కాలనీ పరిస్థితి పై ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి ఒక వాంబే కాలనీ జీవిస్తున్న ప్రజలు ప్రాణాలపై కొంచెం మీరు శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాం  అని భారతీయ జనతా పార్టీ సిటీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎండ అప్పారావు తెలిపారు.