ఎ వి నగరం గ్రామంలో నిర్వహించిన నగర సంకీర్తన ముగింపు కార్యక్రమo
కాకినాడ:
కాకినాడ జిల్లా తొండంగిమం డలం ఎ వి నగరం గ్రామంలో నెలరోజులు పాటు గ్రామంలో నిర్వహించిన నగర సంకీర్తన ముగింపు కార్యక్రమాన్ని భక్తులు భారీ పాదయాత్రతో ముగించారు.
గ్రామంలో కార్తీకమాసం నెల రోజులు పాటు హరేకృష్ణ ధర్మ రక్షణ సమితి సభ్యులు బ్రహ్మ ముహుర్త కాలంలో హరినామం కీర్తిస్తూ సంకీర్తన పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక భక్తి గేయాలతో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ హరే హరే అంటూ భక్తులు నామ కీర్తన చేస్తూ,పల్లకిలో రాముల వారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణుడు,సీతా రాములు,ఆంజనేయ స్వామి వేషధారణలో భక్తులు అందరినీ ఆకట్టుకుంది.నిరంతరాయంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా నగర సంకీర్తన ముగించుకొని పాడ్యమికి సీతారాములు వారి ఆలయం భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి పయనమవుతారు.ఈ కార్యక్రమంలో హరేకృష్ణ ధర్మ రక్షణ సమితి అధ్యక్షులు దుళ్ళ కృష్ణ, పీర్ల సత్యనారాయణ(పోలీస్), గ్రామ పెద్దలు యనమల సత్యనారాయణ, నాగేశ్వరావు,సమితి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాలుగోన్నారు.


