పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ పాఠశాల క్రీడా మైదానంగా ఉపయోగించు కుంటున్న పాఠశాల యాజమాన్యం.

పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ పాఠశాల క్రీడా మైదానంగా ఉపయోగించు కుంటున్న పాఠశాల యాజమాన్యం.                 

మధురవాడ : న్యూస్ విజన్ : నవంబర్ 07:

పట్టించుకోని జీవీఎంసీ అదికారులు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు.                             

పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ మైదానం పక్కన ఉన్న పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. పాఠశాల క్రీడా మైదానం గా ఉపయోగించుకుంటున్నారు.ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పబ్లిక్ పార్క్ ను పాఠశాల క్రీడా మైదానం లా ఉపయోగించుకుంటున్న జీవీఎంసీ జోన్ 2 అదికారులు ఎవరు అటువైపుగా చూడకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పాఠశాల కు క్రీడా మైదానం ఉందా లేదా లేకపోతె పాఠశాలకు క్రీడా మైదానం లేకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.                 

స్థానికుల వివరణ:  


            పబ్లిక్ పార్కును ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో అభవృద్ధి పనులు నిర్వహిస్తుండటం పై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్థానిక కార్పొరేటర్కి తెలుసా లేక తెలియదా అనేది ఒక ప్రశ్నగా మిగిలి పోయింది. కార్పొరేటర్ విషయంలో వార్డ్ ప్రజల్లో భిన్నాభిప్రయాలు వ్యక్తుమవుతున్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసలు కార్పొరేటర్ జాడే కనపడలేదని కొందరు అంటున్నారు. మరి కొందరు పార్టీ అధికారంలో లేదు అధికార పార్టీ మద్దతు ఉండదు కావున పార్టీ మారిన తరువాత మరలా ప్రజలలోకి వస్తారు అని అంటున్నారు. వార్డులో పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం పై పాఠశాల యాజమాన్యం నుంచి నాయకులకు  అధికారులకు భారీగా ముడుపులు అందాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు క్రీడా మైదానం ఉండి దూరంగా ఉంటే విద్యా శాఖ సిబ్బంది ఏమి చేస్తున్నారని అంటున్నారు. క్రీడా మైదానం లేకుండా ఇన్నాళ్లు పాఠశాలను ఎలా కొనసాగించారు అని అంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ సిబ్బంది, జీవీఎంసీ అధికారులు పాఠశాల యాజమాన్యం నుండి ఆ పబ్లిక్ పార్కును ప్రజలకు ఉపయోగపడేలా కాపాడాలని కోరుతున్నారు.           

పాఠశాల సిబ్బంది వివరణ :           


               పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ పాఠశాల మైదానం లా ఉపయోగించుకోవటం పై అడగగా మా పాఠశాలకు మైదానం ఉంది ఆ మైదానం పాఠశాలకు దూరంగా ఉంది. కావున దగ్గరలో ఉన్న పబ్లిక్ పార్క్ ను ఉపయోగిస్తున్నాము. పబ్లిక్ పార్క్ ను ఎవరైనా ఉపయోగించుకోవచ్చుగా అని బదులు ఇచ్చారు. పాఠశాల నుండి సదరు జోనల్ కమీషనర్ కి అభ్యర్ధించగా జోనల్ కమీషనర్ అనుమతులు ఇచ్చారు అని తెలిపారు.              

జోన్2 కమీషనర్ వివరణ :

జోన్2 కమీషనర్ పి సింహాచలం ను వివరణ కోరగా ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు ఆ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మేము పార్కును అభివృద్ధి చేస్తాము అని అడిగారు వారి విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాము. అభివృద్ధి చేసిన పాఠశాల క్రీడా మైదానం కొరకు ఉపయోగించటానికి లేదు అని అన్నారు. మీ అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యం పార్క్లో వారి సొంత మైదానం వలె పనులు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించగా పాఠశాల యాజమాన్యంకి నోటీసులు అందచేసి పనులు నిలుపుదల చేసి చర్యలు తీసుకుంటాము అని జోన్2 కమీషనర్ సింహాచలం తెలిపారు.