గ్రీన్ డెల్ పాఠశాల లో స్పోర్ట్స్ డే వేడుకలులో పాల్గొన్న గంటా తనయుడు గంటా రవితేజ.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 09:
ఎండాడలో ఉన్న గ్రీన్ డెల్ పాఠశాల ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్ రవీంద్ర ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు సినీ నటుడు మరియు భీమిలి శాసనసభ్యులు గంటా తనయుడు టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంటా రవితేజ మాట్లాడుతూ గ్రీన్ డెల్ పాఠశాలలో శనివారం స్పోర్ట్స్ డే వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.
ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడీలకి ప్రాధాన్యత ఇవ్వాలి.
అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒలింపిక్స్, ఏషియన్ విజేతలకు ప్రోత్సాహకం 75 లక్షలు నుంచి 7 కోట్లు పెంచడం చాలా ఆనందంగా ఉంది.
ప్రతి జిల్లాలు నుంచి క్రీడాకారులు ముందుకు రావాలి. క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించటంలో ఈ ముందు ఉంటుంది. చిన్నప్పటినుండే చదువుతో పాటు క్రీడలలో పాల్గొనే విధంగా తల్లి తండ్రులే ప్రోత్సాహించాలి. క్రీడలు కూడా మనిషి జీవితంలో ఒక భాగం అనేవిధంగా పిల్లలకు సూచించాలి. ఆటలు వళ్ల మనిషి మాసిక ఉల్లాసంగా, శరీరక దృఢత్వం పెరుగుతుంది అని తెలపాలి అప్పుడే పిల్లలలో క్రీడలపై మక్కువ ఏర్పడుతుంది అని అన్నారు.