5వవార్డ్ కొత్త పరదేశీపాలెం గ్రామంలో నూతన కాలువలు నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత

5వవార్డ్ కొత్త పరదేశీపాలెం గ్రామంలో నూతన కాలువలు నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 11: 

5వవార్డ్ కొత్త పరదేశీపాలెం గ్రామంలో నూతన కాలువలు నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం 5వవార్డ్ జనసేన సీనియర్ యువ నాయకులు ఎడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 79, మరియు 80,వ సచివాలయాలలో ప్రధానమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి చిత్రపటాలను కార్యాలయంలో పెట్టాలని అందచేశారు. అదేవిధంగా 80వ సచివాలయంలో ప్రింటర్ పనిచేయకపోవటంతో విధులకు ఆటంకం కలుగుతుందని ప్రింటర్ మారమ్మతులు చేయించి సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, 5వవార్డ్ జనరల్ సెక్రటరీ ఈశ్వరరావు, సెక్రటరీ నరేష్, టీడీపీ వార్డ్ యువత అధ్యక్షులు కొండాపు రాజు, నర్సింగా రావు, వెంకట్ రెడ్డి, శివ, సుబ్బు రెడ్డి, తదితర జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు.