అయోమయంలో మీసేవ నిర్వాహకుల జీవితాలు! మీసేవ నిర్వాహకులకి మంచి రోజులు ఎప్పుడు?

అయోమయంలో మీసేవ నిర్వాహకుల జీవితాలు! మీసేవ నిర్వాహకులకి మంచి రోజులు ఎప్పుడు?  

విశాఖపట్నం : వి న్యూస్ : నవంబర్ 23: 

ఐటీ శాఖ మంత్రి యువగళం పాదయాత్రలో మీసేవ నిర్వాహకులకు ఇచ్చిన మాటను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్న మీసేవ నిర్వాహకులు.

 

ఇంటర్మీడియట్, డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేక వయసు పై బడి ఉన్నవారు, వికలాంగులు కుటుంభ నిర్వహణ కొరకు స్వయం ఉపాధి క్రింద ఇంటర్నెట్ సెంటర్ మరియు ఇతర వ్యాపార నిర్వహణ చేసుకుంటున్న వారికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 సంవత్సరంలో మీసేవ కేంద్రాల నిర్వహణ కొరకు అప్పటి ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇచ్చి టైపు ఎక్సమ్ నిర్వహించి మీసేవ నిభందనలు ప్రకారం 10X15 స్పేస్ లో షాప్, ఇన్వెర్టర్, కలర్ ప్రింటర్, లేజర్ ప్రింటర్ అన్ని సదుపాయాలు వున్నాయి అని నిర్ధారణ చేసిన తరువాత  ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ మీసేవ నిర్వాహకుడికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వారు.  ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రలో వేలాది మంది మీసేవ నిర్వహణ చేసుకుంటూ వారి జీవనం సాగించేవారు. రాష్ట్ర విభజన అయిన తరువాత కూడా నిర్వహణ చేసుకుంటూ వున్నారు. 2019 సంవత్సరంలో అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సచివాలయ వ్యవస్థ ప్రకటించినప్పటినుండి ప్రారంభమయ్యే వరకు మీసేవ నిర్వాహకులకు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ విధి నిర్వహణ కొరకు అవకాశం ఇస్తామని సచివాలయలు ప్రారంభించేసరికి మీసేవ నిర్వాహకులను టీడీపీ పార్టీకి చెందిన వారు వారికి సచివాలయాలలో చోటు లేదు అని మీసేవ సర్వీసులు సచివాలయాలలోకి అందుబాటులో తీసుకుని వచ్చారు. ఇంకా మీసేవ నిర్వాహకులను ఇబ్బంది పెట్టేందుకు అప్పటి వాలంటీర్లతో సచివాలయాలలో తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే ప్రభుత్వ పథకాలలో ఉపయోగించాలి అని ప్రజలలో విస్తృత ప్రచారం చేసి మీసేవ ధ్రువపత్రాలు చెల్లవు అని ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసారు. మీసేవలో ధ్రువపత్రానికి అర్జీ పెడితే సంక్షేమ పథకాలు ఆపేస్తామని సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజలను, మీసేవ నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసేవారు. ఒక్కసారిగా మీసేవలో సర్వీసుల కోసం ప్రజల రాకపోవడంతో మీసేవ నిర్వాహకులు ఐదు సంవత్సరాలు మీసేవ నిర్వహణ భారంగా మారడం కనీసం షాప్ అద్దెలు కూడా కట్టకోలేక కొందరు మీసేవ సెంటర్లు మూసి వేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఆరువేలు పైచిలుకు మీసేవ నిర్వాహకులు అన్నీ ఒడిదుడుకులు తట్టుకుని మళ్ళీ ప్రభుత్వం మారి మీసేవ నిర్వాహకులకు పూర్వ వైభవం కల్పిస్తారని కోటి ఆశలతో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని పాద యాత్రలో జిల్లాలకు వెళ్లినప్పుడు ఆ జిల్లా మీసేవ నిర్వాహకులు కలవడం అందుకు నారా లోకేష్ మన ప్రభుత్యం రాగానే మీసేవ నిర్వాహకులకు అని విధాలా సహకారం ఇస్తాం అని  రాసి పెట్టుకోండి తేదీ సమయం మన ప్రభుత్వం ఏర్పాటయ్యిన వంద రోజులలో మీసేవ నిర్వాహకులకు ఒక నిర్ధిష్టమైన భద్రత ఏర్పాటు చేసి మీసేవ వ్యవస్థకు పూర్వ వైభవం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.  సార్వత్రిక ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించగానే మీసేవ నిర్వాహకులు చాలా ఆశతో వారు మాట ఇచ్చారు మనకి మంచి రోజులు వస్తాయి అని చూస్తున్న సమయంలో సుమారు 100 పౌర సేవలు వాట్సాప్ లో అందచేస్తాము అనే వార్త సోషల్ మీడియాలో చూసి మీసేవ నిర్వాహకులు ఎదరు చూస్తునే మంచి రోజులు ఇంకా మనకి రావు అనే భయంతో కాలం వెళ్ళదీస్తున్నారు. రాష్ట్ర మీసేవ సంఘం సభ్యులు గతంలో నారా లోకేష్ ఐటీశాఖ  మంత్రివర్యులుగా వున్న సమయంలో వారికి మీసేవ మీద పూర్తిగా అవగాహన వుండడం మరియు ఇప్పుడు కూడా వారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి కావటం చేత మీసేవ నిర్వాహకుల కష్టాలు వారితో  ఒక 15 నిముషాలు చెప్పుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే తోటి నిర్వాహకులకు ప్రభుత్యం నుంచి మంచి వార్త వస్తుంది అని మిగిలిన మీసేవ నిర్వాహకులకు చెపుతూ వస్తునారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీసేవ వ్యవస్థకు పూర్వవైభం తీసుకుని వస్తారు అని ఎదురు చూస్తున్నారు అని రాష్ట్ర మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం సభ్యులు ఆశిస్తున్నామని అన్నారు.