రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో మాలతాంబ విద్యార్థులకు 32అంశాలలో 28 బహుమతులు.
విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసిన ఎన్.ఐ.ఎఫ్.ఎస్.విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి.
రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో బహుమతులు గెలుచుకున్న మాలతాంబ విద్యార్థులను శనివారం పాఠశాలలో జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు, ఎన్.ఐ.ఎఫ్.ఎస్ విద్యాసంస్థల సి.ఈ.ఓ. సునీల్ మహంతి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు, ఎన్.ఐ.ఎఫ్.ఎస్ విద్యాసంస్థల సి.ఈ.ఓ. సునీల్ మహంతి అన్నారు. జీవీఎంసీ 6వ వార్డు పరిధి కార్ షెడ్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్ లో శనివారం రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి. క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రతిభా పురస్కారాలు, మెడల్స్ ను అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మహంతి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విద్యతోపాటు క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ లలో కూడా తర్ఫీదు ఇచ్చి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నట్లు తెలియజేశారు.
జిల్లా స్థాయిలో నిర్వహించిన విశాఖ బాలోత్సవంలో 120 పాఠశాలలో 8,000 మంది విద్యార్థులు (కథారచన,సైన్స్ ఎగ్జిబిషన్, చెత్తతో సంపద సృష్టి, మెమొరీ, క్విజ్, జానపద కళలు, నృత్యాలు, ఏకపాత్రాభినయం, పద్యాలు వాటి భావాలు, లఘు నాటికలు, వార్తలు రచనలు, మట్టితో బొమ్మలు, నిప్పు లేకుండా వంటలు, డ్రాయింగ్) పోటీలలో పాల్గొనగా మాలతాంబ విద్యార్థులు 32 అంశాలలో 28 బహుమతులు పొందారని తెలియజేశారు. గతవారం జిల్లా స్థాయిలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడలలో 30మంది మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులకు 6రాష్ట్రస్థాయి 24 జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నారని. జనవిజ్ఞాన వేదిక. చెకుముకి టాలెంట్ టెస్ట్ లో తమ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలు సాధించారని, వక్త్రృత్వ పోటీలో మూఢనమ్మకాలు ఆధునిక విజ్ఞానం అనే అంశంపై జిల్లా ప్రథమ స్థానం, మాస్టర్ ఆర్ట్స్ లో ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జనరల్ మేనేజర్ డాక్టర్ జి.పి.ఆర్. కృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ ఏ.ఆదిమూర్తి, వైస్-ప్రిన్సిపాల్ బి శ్రీదేవి, ఫిజికల్ డైరెక్టర్ బి హరీష్, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.