డ్రైనేజి పలకలు లేక పొవటంతో కాలువలోకి పడి పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ గోవు

డ్రైనేజి పలకలు లేక పొవటంతో కాలువలోకి పడి పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ గోవు.

మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 24:

చంద్రంపాలెం దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోమాత డ్రైనేజి పలకలు లేక పొవటంతో కాలువలోకి పడి పోయి తీవ్ర ఇబ్బందులు పడింది. గోవు కాలువలో పడి బయటకి రావటానికి ఇబ్బందులు పడుతుండటంతో పోవటంతో స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు తాళ్ళు కర్రలు సహాయంతో సుమారు 15 మంది శ్రమించి గోమాతను బయటకి తీసి కాపాడారు. కాలువలుపైన పలకలు లేక మనుసులు కూడా పడి ప్రమాదాలకు గురవుతున్నారని జీవీఎంసీ అధికారులు గుర్తించి పలకలు వేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.