అక్రమ తవ్వకాలుపై భీమిలి ఆర్.డి.ఓ సంగీత్ మాధుర్ పిర్యాదుతో పలువురుపై కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు
భీమిలి : వి న్యూస్ : నవంబర్ 24:
విశాఖపట్నం జిల్లా భీముని పట్నం మండలం ఆర్. డి. ఓ కణాల సంగీత్ మాధుర్ ఇచ్చిన పిర్యాదు మేరకు తాసిల్దార్ మరియు వారి యొక్క ఫీల్డ్ సిబ్బంది ఎస్సీ కాలనీ సోమన్నపాలెం, కే నగరపాలెం, కాపులప్పాడ విలేజ్, భీమిలిపట్నం మండలంలో విచారణ చెయ్యగా ఆ ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు ద్వారా గుర్తించారు. ఆర్ డి. ఓ అక్రమంగా పాల్పడుతున్న వారిపై సుమారు 15మంది వక్తులను గుర్తించి వారిపై పిర్యాదు చేసారు. ఆర్ డి పిర్యాదు పై భీమిలి పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమంగా తవ్వకాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు అని భీమిలి సి. ఐ సుధాకర్ తెలియచేసారు.