సంఘం అభివృద్ధి కొరకు అందరూ ఒకే బాటలో నడవాలి.
విశాఖ జిల్లా ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు అంబటి పూడి సుధీర్ కుమార్ శర్మ
విశాఖ లోకల్ న్యూస్ :పి .ఎం.పాలెం.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ వితరణ కార్యక్రమం పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ వద్ద కొలివై ఉన్న శ్రీ దుర్గాంబికా అమ్మవారి ఆలయం లో విశాఖపట్నం జిల్లా ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు అంబటి పూడి సుధీర్ కుమార్ శర్మ, జిల్లా సెక్రటరీ మావుడూరు సంపత్ కుమార్ శర్మ మరియు జిల్లా కోశాధికారి మురపాక అనీల్ కుమార్ శర్మ చేతులు మీదగా మధురవాడ ఏరియా సంఘ సభ్యులుకు వారి చేతులు మీదగా పంచాంగ వితరణ కార్యక్రమం జరిగింది.ముందుగా శ్రీ దుర్గాంబికా అమ్మవారి ఆలయ అర్చకులు రావి నర్సింహా మూర్తి వచ్చిన సంఘ పెద్దలకు శాలువ కప్పి సత్కరించారు.
జిల్లా అధ్యక్షులు వారి మాట్లాడుతూ మన బ్రాహ్మణులు అందరూ ఒకే తాటి మీద నడిస్తే బాగుంటుంది మన సంఘం మనకు బలం ఈ సంఘం అభివృద్ధి కొరకు అందరూ సహకరించాలని సభ్యులుకు తెలిపారు.
జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సంఘాలలో మన ఈ సంఘం చాలా గొప్పదని ఆపదలో ఉన్న బ్రాహ్మణులును ఆదుకోవడం లో ఉన్న మొదటి సంఘం మనదని తెలిపారు.
జిల్లా కోశాధికారి మాట్లాడుతూ మధురవాడ పరిసర ప్రాంతాలలో ఉన్న బ్రాహ్మణులు ఈ సంఘం లో సభ్యత్వం తీసుకొని సంఘం అభివృద్ధికి తోడ్పాడుతురాని అన్నారు.
ఈ కార్యక్రమం మధురవాడ ఏరియా ఇంచార్జ్ రాజశేఖర్, మరియు జిల్లా కమిటీ సభ్యులు సాయినాధ్ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

