ఎండాడలో గ్రామ గ్రామాన యోగ నిర్వహించిన అంబేద్కర్ యువజన సేవా సంఘం యువకులు
ఎండాడ: విశాఖ లోకల్ : జూన్ 08:
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గ్రామ గ్రామాన యోగ అనే పేరుతో ఎండాడలో అంబేద్కర్ యువజన సేవా సంఘం యువకులు యోగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ పిలుపుమేరకు సీఎం చంద్రబాబు యోగాంధ్ర పేరిట 21వతేదీ నిర్వహించే కార్యక్రమానికి ఎండాడ ఎస్సీకాలనీ అంబేద్కర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో యోగా ట్రైనర్ గిరి పర్యవేక్షణలో ఆదివారం యోగ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి 8వవార్డు ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీనివాస్ అంబేద్కర్ యువజన సేవాసంఘం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.