ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం...! కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం :విశాఖ లోకల్ న్యూస్
పంచాయతీ పరిసరాలు, పూల మార్కెట్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులు, రైతులకు స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ హెచ్చరికలు జారీ చేశారు. విచ్చలవిడిగా వినియోగిస్తే జరిమానా తో పాటు దుకాణాలు కూడా సీజ్ చేయడానికి వెనుకడుగు వేసేది లేదని పేర్కొన్నారు. ఆటోలో ఆయన ప్రచారం చేస్తూ అందర్నీ స్వయంగా కలుసుకుని జాగృతం చేశారు. సమాజంలో పర్యావరణ రహిత మైన మార్పు జరగాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలా తీసుకోవాలన్నారు.ప్లాస్టిక్ వాడకం మన జీవన మనుగడలో భాగమైపోయింది అని వాటి వినియోగం లేకపోతే బతకలేమన్న స్థితిలో ఉన్నామన్నారు. యువత తలచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్లాస్టిక్ వస్తువుల కు బదులు ప్రత్యామ్నాయ వస్తువులు ప్రకృతి పరంగా మనకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ రహితమైన వస్తువులు వినియోగించినట్లయితే సంబంధించిన పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి అన్నారు. ప్లాస్టిక్ స్థానంలో వస్త్ర సంచులు, నార వస్తువులు వాడాలని సూచించారు.ఈ ప్రచారం మూడు రోజుల పాటు నిర్వహిస్తామని ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కార్యక్రమంలో నవీన్ జ్ఞానేశ్వర్ తోపాటు కార్యదర్శి నరసింగరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

