మాజీ విశాఖ మీసేవ జోనల్ మేనేజర్ ని సత్కరించిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.
మీసేవ లకు చేసిన సేవలు మరువలేనివి : విశాఖ మీసేవ ఆపరేటర్లు
విశాఖ :వి న్యూస్ : అక్టోబర్ 21:
ఏపీ ఆన్లైన్ మీసేవ ఉమ్మడి విశాఖ జోనల్ మేనేజర్ సత్యనారాయణని మీసేవ ఏపీ ఆన్లైన్ ఆపరేటర్లు ఘనంగా సత్కరించారు. 10 సం లకు పైగా ఏపీ ఆన్లైన్ మీ సేవ జోనల్ మేనేజర్గా ఈమధ్య కాలంలో ఉద్యోగం వదిలేసిన ఆయన్ని మీసేవ ఆపరేటర్లు శనివారం ఏపీ ఆన్లైన్ కార్యాలయంలో అయన మీసేవ లకు చేసిన సేవలకు గౌరవంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు మాట్లాడుతూ నిస్వార్థంగా మీసేవ లకు చేసిన సేవలు మరువలేనివి అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాలో మీసేవ ఏపీ ఆన్లైన్ ఆపరేటర్లు పాల్గొన్నారు.


