నగరంపాలెం భూలోకమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి: అక్టోబర్ 17:
నగరంపాలెం రహదారిలో ఉన్న భూలోకమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. నవరాత్రులలో భాగంగా మూడవరోజు అన్నపూర్ణదేవి అవతారం లో అమ్మవారి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం గురువు సిరిపురపు సంతోషి ఆధ్వర్యంలో నగరంపాలెం గ్రూప్, మరియు లక్ష్మీవాణిపాలెం గ్రూప్ సభ్యులు పాల్గొని కోలాటం నృత్యం ప్రదర్శించారు.
కోలాటం బృందం చేసిన ప్రదర్శనను భక్తులు చాలా ఆసక్తిగా తిలకించి కరతాలద్వనులతో ప్రోత్సహించి అభినందించారు. అనంతరం ఆలయ సభ్యులు వెంకట అప్పారావు (బాబు ) ఆదినారాయణ, చిన్నారావు, నాని, సన్నిపాత్రుడు శ్రీ కోలాటం బృందంని అభినందించి గురువుకి తాంబూలం అందచేశారు.



