సైబర్ నేరగాళ్లపై తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన
మధురవాడ:
ఇటీవల కాలంలో సైబర్ ఆర్ధిక నేరగాళ్ల ముసుగులో పడి ప్రజలు తమ ఆస్తులను జీవితాళను కోల్పోతున్న సంఘటనలు వలన ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు, రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో విద్యార్థులకు వాటిపై అవగాహన ఉండాలని అన్నారు. ప్రజలు తమకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. సెల్ ఫోన్లలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, సిమ్ కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలు ప్రమాదాలు జరిగినప్పుడు 100కు కానీ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి డయల్ చేయాలని అన్నారు. అలా చేసిన వెంటనే పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుంది అని సూచించారు అనే సూచనలతో విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు మేరకు గురువారం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలు బస్సులు పై పోస్టర్స్ ను అంటించి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నిర్వహించారు.

.jpeg)