కొండపేటలో పలు సమస్యలను పరిష్కరించిన జనసేన నాయకురాలు పరిమి భువనేశ్వరి. జీవీఎంసీ1వవార్డ్ తగరపువలస

కొండపేటలో పలు సమస్యలను పరిష్కరించిన జనసేన నాయకురాలు పరిమి భువనేశ్వరి. జీవీఎంసీ1వవార్డ్ తగరపువలస

భీమిలి:

కొండపేట ప్రాంగణంలో పంప్ హౌస్ పైప్ లీక్ అవ్వడం వల్ల,హఠాత్ వర్షాలు వల్ల డ్యామేజ్ నిండి వాటర్ రోడ్డుపై నిలిచి రహదారిలో పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విషయం తెలుసుకున్న 1వ జనసేన పార్టీ నాయకురాలు పరిమి భువనేశ్వరి వెంటనే అక్కడికి చేరుకుని ప్రజల సమక్షంలో అధికారులతో మాట్లాడి అధికారి శ్రీనివాసరావు ఏఈ కి సమస్యను తెలపగా ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డుకి మరమ్మతులు చేయించారని తెలిపారు.

భువనేశ్వరి అధికారులతో మాట్లాడుతూ ఈ సమస్యకి తాత్కాలిక పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం కొండపేట వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బీసీ బాలికల పాఠశాల వెనక సెప్టిక్ ట్యాంక్ లీక్ అవ్వడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు అని వెంటనే భువనేశ్వరి తన సొంత నిధులతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొండపేట ఏరియాలో ఉండి ఆ సమస్యను పరిష్కరించారు. ఈ సమస్యల్ని పరిష్కరించిన జనసేన పార్టీ వీర మహిళ భువనేశ్వరికి, వెంపాడ లక్ష్మీకి, కొండపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.