నగరంలో తనదైన ముద్ర వేసిన కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ

నగరంలో తనదైన ముద్ర వేసిన కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ

 ఆత్మీయ సన్మాన సభలో నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి

 విశాఖపట్నం:


       విశాఖపట్నం, సెప్టెంబర్ – 15:-  నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మంచి పేరు పొందిన

ఐఏఎస్ అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ అని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

పేర్కొన్నారు. గురువారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో

బదిలీపై వెళ్తున్న జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ  ఆత్మీయ సన్మాన సభలో

డిప్యుటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, అన్ని పార్టీల ఫ్లోర్

లీడర్లు, కార్పొరేటర్లు, జివిఎంసి ఉన్నతాధికారులు, ఇతర అధికారులు తో కలసి ముఖ్య అతిధిగా

పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పధంలో

నడిపించి, తనదైన ముద్ర వేసిన అధికారి మన లక్ష్మీశ అని, పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించి,

కౌన్సిల్ సమావేశంలో కార్పోరేటర్ల అందరికీ మాట్లాడే సమయం సరిపోలేదని గ్రహించి

“కాఫీ విత్ కార్పొరేటర్స్” అనే కార్యక్రమాన్ని చేపట్టి వార్డులోని ప్రతి సమస్యను

పరిష్కరించారని, ప్రతి కార్పొరేటర్ ను ఆత్మీయంగా పేరు పెట్టి పలకరించిన అధికారి అని,

విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చూడాలనే సంకల్పంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను

జూన్, 5వ తేదీన “పర్యావరణ” దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ ను నిషేధించారని,

ప్లాస్టిక్ నిర్మూలనకు నిత్యం ప్రజలలో చైతన్యం కల్పించి విశాఖ నగర కీర్తిని దేశ

ప్రధాని నోట పలికించిన ఘనత డాక్టర్ జి. లక్ష్మీశ దే అని తెలిపారు. నగర శుభ్రత తో పాటు,

విశాఖ సుందర బీచ్ లోని వ్యర్ధాల నిర్మూలనకు కంకణం కట్టి ఒకే రోజు 28 కిమీ బీచ్ తీరాన్ని

22 వేల మంది వాలంటీర్లతో శుభ్రం చేయించి ప్రపంచ రికార్డుతో పాటూ రాష్ట్ర

ముఖ్యమంత్రి వై. ఎస్. జనగామోహన్ రెడ్డి ని సంతృప్తి పరచి, రాష్ట్ర మొత్తం

ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చే ప్రకటన చేయించిన న ఘనత

కూడా లక్ష్మీశ దే అని తెలిపారు. ఇటువంటి అధికారి బదిలీపై వెళ్తున్నందుకు బాధగా వున్నా,

ఆనందంగా వుందని త్వరలోనే జిల్లా కలక్టర్ గా విశాఖపట్నానికి రావాలని ఆశిస్తున్నానని

తెలిపారు.

అనంతరం జియ్యని శ్రీధర్ మాట్లాడుతూ విశాఖ నగరానికి ఒక గుర్తింపు చేచ్చిన అధికారి

బదిల్లెపై వెళ్తున్నప్పటికీ, ఆయన సేవలు ఓకే జిల్లాకే కాక రాష్ట్రంలో 26 జిల్లాలకు

అవసరమని భావించిన ముఖ్యమంత్రి ఆయనకు మరిన్ని బాధ్యతలను అప్పజెప్పారని, ఆయన

ఎప్పుడూ వున్నత స్థాయిలో వుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏది మంచి, ఏది చెడ్డ అనే

విషయాలను కమిషనర్ నుంచి మేము నేర్చుకున్నామని, నిత్యం వర్డులలో పర్యటించి ప్రజా

సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించడం, ముందున్న వ్యక్తిని ఆయన ఏ స్థాయిలో

వున్నా ఆ స్థానానికి న్యాయం చేసారని డిప్యుటీ మేయర్ కట్టమూరి సతిష్

పేర్కొన్నారు. అందర్నీ పేరుపెట్టి ఆప్యాతతో పలకరించి తక్కువ కాలంలో విశాఖ నగరాన్ని

పరిశుభ్రత నగరాలలో ఒక నగరంగా తీర్చిదిద్దారని త్వరలోనే ఆయన ప్రిన్సిపాల్

కార్యదర్శిగా చూస్తామని ఆశిస్తున్నాము. వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ర్ లీడర్ బాణాల

శ్రీనివాస రావు తెలిపారు. అన్ని పార్టీలచే ఆటలు ఆడించి, అందరినీ ఏకం చేసిన అధికారని,

నగరాభివృద్ధితో పాటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న అధికారాని టిడిపి ఫ్లోర్ లీడర్

పల్లా శ్రీనివాస రావు తెలిపారు. జాతీయా స్థాయిలో విశాఖ నగరానికి ఒక గుర్తింపు తెచ్చిన

డైనమిక్ అధికారి, 25 లక్షల మంది ప్రజల మన్ననలను పొందారని సిపిఐ లీడర్ స్టాలిన్ తెలిపారు.

11 నెలలు వ్యవధిలో నగర ప్రజలను అర్ధం చేసుకొని కార్పరేటర్లతో అధికారిగా కాకుండా

స్నేహపూర్వకంగా మెలిగి, ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేసిన ఘనత ఆయనదేనని సిపిఐఎం

ఫ్లోర్ లీడర్ బి. గంగారావు పేర్కొన్నారు. 100 రోజులలో ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన

కల్పించి, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసిన అధికారి లక్ష్మీశానే అని

జనసేన ఫ్లోర్ లీడర్ వసంత పేర్కొన్నారు. తదుపరి కమిషనర్ చేసిన కృషిని పలువురు

కార్పొరేటర్లు అధికారులు ప్రశంసించారు.

అనంతరం కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖ ప్రజలు, ప్రజా

ప్రతినిధులు చాలా మంచివారని, అధికారులు ఏ పని తలపెట్టినా అందుకు అందుకు వారి సహకారాలు

ఏనాలేనివని, ప్రజలు, అధికారుల సహకారం లేనిదే ఏ అధికారి పని చేయలేరని అందుకు సహకరించిన

ప్రైవేట్, ప్రభుత్వ సెక్టార్ అధికారులకు, వ్యాపార సంస్థల యజమానులకు, విద్యా

సంస్థల యాజమాన్యానికి, ఆర్.డబ్ల్యూ.ఏస్, ఎన్జిఓస్, స్వచ్ఛ అంబాసిడర్లు, చైర్

పర్సన్, జిల్లా ప్రజా ప్రతినిధులు అందరికీ ముఖ్యంగా ప్రజలకు, పాత్రికేయులకు కృతజ్ఞతలు

తెలిపారు.