ఎంఈవో రెండవ పోస్టుకు సంబంధించి సరైన స్పష్టత ఇవ్వాలి బి.టి.ఎ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ బాబు
(వి న్యూస్: విశాఖపట్నం)
ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ బాబు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్ లాగ్ ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేసి,, కరోనా సమయంలో విధులు నిర్వహించి ప్రాణాలు కోల్పోయిన ఉపాద్యాయుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ,ఉపాద్యాయుల బదిలీ షెడ్యూల్ ను ప్రకటించి మండలం పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఎంఈవో రెండవ పోస్టుకు సంబంధించి సరైన స్పష్టత ఇవ్వాలని కోరారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్, శశికాంత్, శంకర్రావు,వెంకటరమణ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.