పి .ఎఫ్ .ఎస్ .ఎల్. అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు.
విశాఖపట్నం:
ప్రొఫెషనల్ ఫుట్బాల్ సూపర్ లీగ్ అసోసియేషన్ (పి .ఎఫ్ .ఎస్ .ఎల్. అసోసియేషన్ ) వారి ఆధ్వర్యంలో స్వర్గ వంకర లక్ష్మీపతి జ్ఞాపకార్థం స్థానిక విశాఖపట్నం, రైల్వే గ్రౌండ్ నందు తేది. 24 సెప్టెంబర్ నుండి తేది. 01అక్టోబర్ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పి .ఎఫ్ .ఎస్ .ఎల్ .సీజన్-3 ఫుట్బాల్ పోటీలు నిర్వహించబడును. ఈ యొక్క టోర్నమెంట్ను వంకర లక్ష్మీపతి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు కేట్ ఫుట్బాల్ మెంబెర్స్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా 8 జట్లు పాల్గొంటున్నాయి. మరియు లీగ్ కమ్ నాకౌట్ స్టేజస్ వారీగా ఈ టోర్నమెంట్ నిర్వహించడడుతుందని టోర్నీ నిర్వాహకుడు కె.వి.యస్.వి.ప్రసాద్ తెలియజేసినారు.
ఈ టోర్నమెంట్ విజేతలకు ఈ క్రింది విధంగా నగదు బహూకరించబడును. మొదటి బహుమతి ద్వితీయ బహుమతి -రూ॥50,000/-లు + ట్రోఫీ -రూ॥30,000/-లు + ట్రోఫీ
ప్రతి ఒక్కరు సహకరించి ఈ టోర్నీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.