శ్రీలక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉడుపురాట మహోత్సవం.!
26నుండి అక్టోబర్5వరకు ఉత్సవాలు, అక్టోబర్-2 ఆదివారం అన్నసంతర్పణ.
మధురవాడ వి న్యూస్ ప్రతినిధి:
జీవీఎంసీ 5,7,వార్డ్ ల పరిధి స్వతంత్రనగర్ శ్రీలక్ష్మీదేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆలయ అధ్యక్షులు వాసుపిల్లి బండియ్య,ఆలయకమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉడుపురాట (ముహూర్తపురాట) మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆలయ కార్యదర్శి బాలుపాత్రో,శ్వేత దంపతులచే శాస్త్రోక్తంగా ఆలయ ప్రధానార్చకులు పూలఖండం గౌరీప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను వితరణ గావించారు.
ఈసందర్బంగా కార్యదర్శి బాలుపాత్రో మాట్లాడుతూ..ప్రతీ ఏటా శ్రీలక్ష్మీ దేవిఅమ్మవారి ఆలయంలో దసరానవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వచ్చామని,అదేవిధంగా ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈనెల సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈఉత్సవాల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు,సహస్ర కుంకుమార్చన,పంచామృత అభిషేకాలు,హోమాలతో పాటుగా అన్నసమారాధ, అఖండదీపారాధన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కొత్తాల శ్రీను,కమిటీ సభ్యులు దాదిగౌరీశంకర్, కూనరమేష్,దిబ్బశ్రీను, అనుపోజు నాగరాజు,జగన్, మరియు సునీల్ పోలిమాటి,కరకాని ఈశ్వరరావు,జోగేశ్వరపాత్రో, ఈరోతిఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.