ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవటానికే యూనివర్సిటీ పేరు మార్పు - టిఎన్ఎస్ఎఫ్
పద్మనాభం:
పద్మనాభం : జగన్ రెడ్డి ప్రభత్వం ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవటానికే యునివర్సిటీ పేరు మార్చిందని తెలుగునాడు విద్యార్ది సమైక్య నియోజకవర్గ ఉపాధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు అన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు నిరసన గా మండలంలోని పద్మనాభం జంక్షన్ లో సుమంత్ నాయుడు ఆధ్వర్యం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగునాడు విద్యార్ది సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ జగన్ కు వాళ్ళ నాన్న గారి మీద ప్రేమ ఉంటే కొత్తగా రాష్ట్రం లో మంజూరు చేశాము అని చెపుతున్న మెడికల్ కాలేజీ లకు వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు కదా అని అన్నారు. శాసన సభలో చెప్తున్నట్టు గా వైఎస్సార్ డాక్టర్ కాబట్టి పేరు పెట్టాము అని చెప్పటం హాస్యాస్పదం గా ఉందని, కడప లో గల అర్కటెక్చర్ యూనివర్శిటీ కి వైఎస్సార్ పేరు ఎలా పెట్టారు అని, అలాగే విశాఖపట్నం లో గల క్రికెట్ స్టేడియం కు వైఎస్సార్ పేరు ఎలా పెట్టారు అని ప్రశ్నించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గంతుకోరు శ్రీను, టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి బసన అప్పలరాజు, కార్యనిర్వహణ కార్యదర్శి కంటుబోతు సుంధరసింగ్ , తెలుగుదేశం పార్టీ బూత్ సెక్రెటరీ తాలాడ అశోక్ , కాళ్ళ బంగారునాయుడు , కంటుబోతు పద్దరాజు, సురాల పైడన్న, బోని రమణ, కనకల సురేష్ , సుంకర నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.