జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్
మధురవాడ:సెప్టెంబర్ 24:
భీమిలి జీవీఎంసీ జోన్ టు చంద్రంపాలెం పాఠశాలని విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, డీఈవో చంద్రకళ సందర్శించారు. జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానాన్ని అలాగే సబ్జెక్ట్ లపై ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులుకు నిర్వహిస్తూ ఇంకా మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలని ఉద్దేశంతోనే చంద్రంపాలెం స్కూల్ ని సందర్శించడం జరిగిందని ఇందులో భాగంగానే ఇద్దరు టీచర్లని ఎంపిక చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు . ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక మొక్కను కూడా నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

