రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కి అసోసియేషన్ కార్యక్రమాలను వివరించిన అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్
విశాఖ లోకల్ న్యూస్:2022 సెప్టెంబర్ 14
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బుధవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అసోసియేషన్ పేరిట సభ్యులకు అందించిన సంక్షేమం గురించి వివరించారు. 2016 వ సంవత్సరం నుండి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా అనేక కార్యక్రమాలను చేసినట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గ్రేటర్ విశాఖ పరిధిలోని అసోసియేషన్ ను భీమిలి నుండి గాజువాక వరకు విస్తరింపజేసి 300 మంది సభ్యులు కలిగిన శక్తివంతమైన జర్నలిస్ట్ యూనియన్ గా తయారు చేశామని మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. జర్నలిస్టుల సాధకబాదలలో భాగస్వామ్యం అవుతూ అండగా నిలుస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. అనంతరం అధ్యక్షులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మంత్రి అమర్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్), ట్రెజరర్ నీలాపు అశోక్ రెడ్డి,ముఖ్య సలహా దారులు కర్రి సత్యనారాయణ (సత్య),సహాయక కార్యదర్శి కొండ్రి వినోద్,ఎగ్జిక్యూటివ్ మెంబర్ బద్ది శిరీష తదితరులు పాల్గొన్నారు.

