జోన్2 జీవీఎంసీ కమిషనర్ బొడ్డేపల్లి. రాము ఆదేశాలతో 36 పందులు హతం.

జోన్2 జీవీఎంసీ కమిషనర్ బొడ్డేపల్లి.రాము ఆదేశాలతో  36 పందులు హతం.

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ ; 2022 సెప్టెంబర్ 14

పందుల స్వేర విహారం పై బుధవారం మధ్యమాల పై వచ్చిన  కథనాల పై మధురవాడ (జోన్2) జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో వెటర్నరీ సీ.ఈ.ఓ డాక్టర్ కిషోర్  వెంటనే స్పదించి సూటర్లను రంగం లోకి దింపి  ఒక్క రోజేలో మోత్తం 36 పందులను మట్టుబెట్టారు. 

జివియంసి 7వ వార్డు స్వతంత్ర నగర్ లో సుమారు 3ఎకరాలలో అభివృద్ది చేస్తున్న పార్కు స్థలం  పందులకు నివాసం గా మారింది.అక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి  చేస్తున్న కాంట్రాక్టు  పర్యవేక్షకులకు వాటిని బయటికి పంపించడం ఓ సమస్యగా మారింది. 5,7వార్డులలో పందుల బేడద పై పలు కదనాలు రాగా  అధికారులు స్పందించిరు. పార్కు లో 8 పందులను,మొత్తం 36 పందులను సూటర్ల తుపాకీతో కాల్చివేశారు. 5వ వార్డు  రాజీవ్ గృహకల్ప కోలనీతో పాటు పలు ప్రాంతాలలో  చేపట్టిన ఈ కార్య క్రమంలో మొత్తం 36 పందలను నిర్మూలించినట్లు ఈ కార్యక్రమాన్ని  పర్యవేక్షించిన జీవీఎంసీ అధికారులు తెలిపారు.