నిందితుడు కనక రాజుకు మూడేళ్ళ జైలుశిక్ష ...
అనకాపల్లి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం నిందితుడుకి మూడేళ్ళ జైలుశిక్ష విధించింది .
వివరాలు: తేది 2021 .డిసెంబర్ 27 న 5వ వార్డ్ శివశక్తి నగర్ కు చెందిన మాడుగుల.కనకరాజు కొమ్మాది అమరావతి కాలనీకి చెందిన ఈగల. పవన్ కుమార్ పై పాత కక్షల నేపథ్యంలో విరిగిన మద్యం బాటిల్ తో పొడిచి హత్యా ప్రయత్నం చేయగా, భాధితుని తండ్రి ఈగల అప్పలనాయుడు పి.ఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్.ఐ సి.చ్. వెంకటరావు దర్యాప్తు చేపట్టినారు.
ఈ కేసు విచారణ అనంతరం అనకాపల్లి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం నిందితుడు కనక రాజుకు మూడేళ్ళ జైలుశిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది అని సి.ఐ రామకృష్ణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు..

