క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిఐ డి రమేష్

 క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న  సి.ఐ.డి రమేష్

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

తెలియని వ్యక్తులను నమ్మవద్దు అని క్రైం అవేర్నెస్ లో ప్రజలకు  క్రైమ్ సిఐడి రమేష్ హెచ్చరించారు.

 విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ అదేశాలతో నగరంలో వివిధ ప్రాంతాలలో ప్రజలకు  నగర పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే ఈ సందర్భంగా జీవీఎంసీ జోన్ టు పరిధిలోని   భీమిలి క్రాస్ రోడ్స్ నందు ఆటో డ్రైవర్లు మరియు ప్రయాణికులతో  పీఎం పాలెం క్రైం సి.ఐ డీ.రమేష్  క్రైం అవేర్నెస్ నిర్వహించి అటెన్షన్ మరియు డైవర్షన్, స్నాచింగ్, బ్యాగ్స్ తెఫ్ట్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

అలాగే మధురవాడ  స్వతంత్ర నగర్ లో కూడా క్రైమ్ మీద మహిళలకు అవగాహన కల్పించి.అక్కడున్న మహిళలు అందరితో నేరాలపై పాంప్లెట్స్ చైన్ స్నాకింగ్స్ ఏటీఎం ప్రార్డ్స్ ప్రతి ఒక్కరూ సిసి కెమెరాలు పెట్టుకోవడం మంచిదని వీటి మీద అవగాహన కల్పిస్తూ మహిళలందరితో చెప్పడం జరిగింది. అలాగే తెలియని వ్యక్తులను నమ్మవద్దు అని పీఎం పాలెం క్రైం సి.ఐ డీ.రమేష్  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  భద్రతపై  మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై అవగాహనా చేపట్టిన పీఎం పాలెం క్రైం పోలీసులకు  ప్రజలు పెద్ద ఎత్తున అభినందించారు.