వార్డు అభివృద్ధే ప్రథమ కర్తవ్యం
రూ.19.95 లక్షలతో రిటైనింగ్ వాల్ పనులకు శంకుస్థాపన
****ఇప్పటికే నిర్మాణాల్లో పలు అభివృద్ధి పనులు
*****సమస్యలు పరిష్కారానికి ప్రధమ ప్రాధాన్యత
******22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖ లోకల్ న్యూస్ సెప్టెంబర్20;
వార్డు అభివృద్ధి, సమస్యలు పరిష్కారించడమే తన ప్రథమ కర్తవ్యమని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పారు. మంగళవారం ఆయన పీతలవానిపాలెం గెడ్డలో 19.95 లక్షల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా పదవి చేపట్టనప్పటి నుంచి వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
న్యూరేసపువానిపాలెం జీవీఎంసీ స్కూలుకు కోటి 34 లక్షల రూపాయలతో స్మార్ట్ స్కూల్ గా తేర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే వార్డులో పలు రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశామన్నారు. వార్డు లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు మంజూరకు కృషి చేయడం జరుగుందన్నారు. దశల వారీగా వార్డు సమస్యలు పరిష్కారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, సైట్ సూపర్ వైజర్ రామారావు, సాయి, పీతల మధుసూదనరావు, ఒమ్మి గోవింద్, నుడగల గణపతి, పెసల శ్రీను, వియ్యపు ఎర్రజి, బొబ్బిలి రవి, డొక్కరి రమణ, మళ్ళ రవి, నక్క మహేష్, పీతల తిరుమల, పీతల రామ్ కుమార్, కాంట్రాక్టర్ శేషు తదితరులు పాల్గొన్నారు.

