డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన గాడు చిన్నికుమారి

డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన గాడు చిన్నికుమారి

భీమిలి విశాఖ లోకల్ న్యూస్:

జీవీఎంసీ జోన్ టు  2వ వార్డు కార్పొరేటర్  గాడు చిన్నికుమారి లక్ష్మి  బ్యాంకు కాలనీ, మామిడి పాలెం, బోరపేట ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. డెంగీ జ్వరాలతో బాధపడుతున్నామని ప్రజలు చెప్పారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు.

బ్యాంకు కాలనీ దగ్గరి రాయపాలెం ఉన్నత పాఠశాల ను సందర్శించారు. ప్రధానోపాధ్యాయురాలు జయంతి రాధాకుమారి  తరగతి గదుల్లోని స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్న విషయాన్ని కార్పోరేటర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ గాడు అప్పలనాయుడు గారు, కోండ్రు కృష్ణ, డెక్కతి అప్పలరెడ్డి, చిల్ల ఎర్రయ్య రెడ్డి, జీరు సత్యం, సరగడ గోపిరెడ్డి, జీరు ఈశ్వర్రావు, పోతాబత్తుల చంటి, పోతాబత్తుల కళ్యాణ్,వనవాడ శివ పాల్గొన్నారు.