నరేంద్ర మోడీ ని ఆదర్శంగా తీసుకుంటాం:ప్రసాదరావు పట్నాయక్

 నరేంద్ర మోడీ ని ఆదర్శంగా తీసుకుంటాం:ప్రసాదరావు పట్నాయక్ 

భీమిలి విశాఖ లోకల్ న్యూస్

ప్రధాని నరేంద్ర మోదీ  73 వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  ఆదేశాల మేరకు   సేవా పక్షోత్సవాలలో భాగంగా  ఆనందపురం మండల పరిధిలోని మెట్ట మీద పాలెం నేషనల్ హైవే దగ్గర బంగారమ్మ తల్లి  ఆలయం దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. 

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు,బిజేపి కిసాన్ మోర్చ ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ బిజేపి రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెంబర్ కోరాడ శంకర రావు, బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు అనంద పురం మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు, మాట్లాడుతూ 2022  సెప్టెంబర్ 17 నుండి 2-10-2022 వరకు ఆనంద పురం మండల పరిధిలోని సేవ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఆదర్శంగా తీసుకొని మేమందరం ఆయన జన్మదిన సందర్భంగా, మేము సేవా కార్యక్రమంలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, బిజేపి నాయకులు గండి లక్ష్మి రావు, పి.చిన్నారావు, కాశి,దుక్క అప్పల సూరి,మరియు బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.


    ,